గాడి తప్పిన కాంగ్రెస్ పాలన
బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పీ ఫైర్
నాగర్ కర్నూల్ జిల్లా – రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ఙ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్కపల్లిలో పర్యటించారు. మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి తో కలిసి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్బంగా రాష్ట్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు రైతు బంధు వేయడంలో ఎందుకు ఆలస్యం చేశారంటూ ప్రశ్నించారు. ఎన్నికల సందర్బంగా వచ్చిన వెంటనే 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి దాకా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఒకే ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ వచ్చారని మిగతా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని వాపోయారు. వేలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి.
కేసీఆర్ సర్కార్ హయాంలో పరీక్షలు నిర్వహిస్తే చివరకు రిజల్ట్స్ ప్రకటించి తామే భర్తీ చేశామని చెప్పడం దారుణమన్నారు.