కూలీల దుర్మరణం సీఎం సంతాపం
బాచుపల్లి ఘటనపై రేవంత్ రెడ్డి ఆరా
హైదరాబాద్ – భారీ వర్షం తీరని విషాదం మిగిల్చేలా చేసింది. బీభత్సమైన గాలి, వానల దెబ్బకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి పోయాయి. మరికొన్ని చోట్ల నడిచేందుకు సైతం ఇబ్బంది ఏర్పడింది. విద్యుత్ షాక్ తో ఒకరు ప్రాణాలు కోల్పోగా బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏకంగా ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారిని ఆదుకుంటామని ప్రకటించారు.
సంఘటన జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. బాచుపల్లి లోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి పోయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఎవరిది తప్పిదమో తేల్చాలని ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
అయితే కుండపోత వర్షం పడడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ లో పని చేసే వారిలో పలువురు మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.