సంక్షేమ ప్రభుత్వం గెలుపు ఖాయం
పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
చిత్తూరు జిల్లా – ఆరు నూరైనా సరే ఈసారి ఎన్నికల్లో సైతం జెండా పాతేది తామేనని కుండ బద్దలు కొట్టారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం పని చేసిందని చెప్పారు. సామాన్యులు, పేదలు, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారందరికీ మేలు చేకూర్చేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకు వచ్చిన ఘనత తమ నాయకుడికి దక్కిందని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని, లక్ష కోట్లకు పైగా అప్పులు చేసి తమ చేతికి ఇచ్చాడని, ఖాళీ ఖజానాతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పయనించేలా చేయడంలో కీలకమైన పాత్ర జగన్ రెడ్డి పోషించారని అన్నారు మంత్రి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్కే రోజా సెల్వమణి ఎండను సైతం లెక్క చేయకుండా నగరి శాసన సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజలతో ముఖా ముఖి నిర్వహిస్తూ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు జీవితం అంతా అబద్దాలేనని, కూటమి కంటున్న కలలు కల్లలు కావడం ఖాయమన్నారు ఆర్కే రోజా సెల్వమణి. సంక్షేమ సర్కార్ మరోసారి పవర్ లోకి వస్తుందన్నారు.