మోడీకి షర్మిల రేడియో గిఫ్ట్
దత్త పుత్రుడి నిర్వాకం వినండి
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వినూత్న ప్రచారానికి శ్రీాకారం చుట్టారు. ఆమె ప్రధానంగా తన సోదరుడు, సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అంతే కాకుండా టీడీపీ కూటమిపై ఫైర్ అవుతూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రతి నెల నెలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ పేరుతో రేడియో కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చారు.
ఈ సందర్బంగా ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి సమస్యలు ఏమిటో ముందు వినాలని కోరారు. ఈ మేరకు తమ ఈతి బాధలు వినేందుకు గాను పీఎంకు రేడియోను బహుమానంగా పంపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఏపీకి ప్రత్యేక హొదా ఇస్తానంటూ ప్రకటించిన మీకు ఈ ప్రాంతంలో అడుగు పెట్టే అర్హత లేదన్నారు ఏపీ పీసీసీ చీఫ్.
ప్రజలను మోసం చేసినందుకు గాను నరేంద్ర మోడీ ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ఏం ఒరగ బెట్టారో చెప్పాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు ఇక్కడికి వచ్చారంటూ నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి.