భారతి కామెంట్స్ షర్మిల సీరియస్
గొడ్డలితో అందరినీ నరికేయండి
కడప జిల్లా – వైఎస్సార్ కుటుంబంలో మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. నువ్వా నేనా అంటూ జగన్ రెడ్డి సోదరి షర్మిల ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయి జగన్ రెడ్డికి ఆప్తుడైన ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అవినాష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా వైఎస్ షర్మిలా రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా జగన్ రెడ్డి భార్య వైఎస్ భారతీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో ఎవరు వచ్చినా వైసీపీదే గెలుపు అని, తామే సింగిల్ ప్లేయర్ అంటూ కామెంట్ చేశారు.
భారతీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. అందరినీ గొడ్డళ్లతో నరుక్కుంటూ పోతే ఏ ఒక్కరూ మిగలరని అప్పుడు మీరు ఒక్కరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారంటూ ఎద్దేవా చేశారు. చెప్పేందుకైనా కాస్తా ముందు వెనుకా ఆలోచించు కోకుండా ఎలా అంటావంటూ మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్.
ఇదేనా భారతీ రెడ్డి స్ట్రాటజీ అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి ఊరు దాటి పోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని ఆరోపించారు. దొంగ పాస్ పార్టులు కూడా తయారు చేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లు తాను గెలిస్తే న్యాయం దక్కినట్లు అని చెప్పారు.