ఓవైసీపై మాధవీలత ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని ఈసీకి
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి కొంపెల్లి మాధవీలత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమె ప్రస్తుతం బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఎంఐఎం చీఫ్ , సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పోటీ పడుతున్నారు.
తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు మాధవీలత. ఛత్రపతి శంభాజీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మూడు సార్లు బాబ్రీ మసీదు గురించి ప్రస్తావించారు. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు కొంపెల్లి మాధవీలత.
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఒక బాధ్యత కలిగిన నేతగా ఉంటూ ఇలా మనుషులు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కొంపెల్లి మాధవీ లత ఫిర్యాదు చేశారు.
వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఎంపీగా అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై ఇంకా స్పందించ లేదు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.