NEWSTELANGANA

ఆపినా స‌రే మాట త‌ప్ప‌ను

Share it with your family & friends

9వ తేదీ లోపు రుణ మాఫీ

హైద‌రాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే రైతు భ‌రోసాకు సంబంధించి ఎన్నిక‌ల సంఘం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఈసీ సీఎం కు నోటీసు జారీ చేసింది. ఇది పూర్తిగా ఎన్నిక‌ల రూల్స్ కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి మ‌రింత దూకుడు పెంచారు. ఆయ‌న ఏకంగా ఈసీని కాద‌ని రైతు భ‌రోసా వేస్తామ‌న‌డం విస్తు పోయేలా చేసింది. ఇప్ప‌టికే ఈసీ నోటీసు ఇచ్చింద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు కూడా చెప్పారు . ఈసీ ఆపినా ఆగ‌న‌ని, తాను ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్ , బీజేపీ నేత‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. వారి నిర్వాకం కార‌ణంగానే ఈసీ రైతు భ‌రోసాను నిలిపి వేయ‌మ‌ని ఆదేశాలు ఇచ్చింద‌న్నారు. తెలంగాణ రైతుల రుణం తీర్చుకునేందుకు రైతు భ‌రోసా ప‌థ‌కం కింద రైతుల ఖాతాలో వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయినా వేయొద్దంటూ ఎన్నిక‌ల సంఘం ఈసీ నోటీస్ ఇవ్వ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.