మోదీ ముందు సమాధానం చెప్పు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక
ఉత్తర ప్రదేశ్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రాయ్ బరేలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
మోదీ పొద్దస్తమానం దేశం గురించి మాట్లాడటం , ఆలోచించడం మానేశారని కానీ ప్రతి రోజూ తన సోదరుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ దేశానికి తెలుసన్నారు.
ఇవాళ 10 ఏళ్ల తమ పాలనా కాలంలో ఎన్ని కొత్త పరిశ్రమలు దేశానికి తీసుకు వచ్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. కేవలం అబద్దాల పునాదుల మీద పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రస్తుత ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.
పీఎం తన మిత్రులకు రూ. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారంటూ మండిపడ్డారు. రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని వాపోయారు.