NEWSANDHRA PRADESH

ఉద్యోగ ఓట‌ర్ల‌కు ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

మ‌రో రోజు గ‌డువు పెంచిన ఈసీ

అమ‌రావ‌తి – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ ఎన్నిక‌ల ప్ర‌త్యేక అధికారి ముఖేష్ కుమార్ మీనా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు. పోస్ట‌ల్ బ్యాలెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఉద్యోగుల‌కు మరో ఛాన్స్ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఉద్యోగులంద‌రూ స్వేచ్ఛ‌గా ఓటు వేసేందుకు గాను పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగానికి సంబంధించి మే 9వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలిపారు ముఖేష్ కుమార్ మీనా. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో 4 ల‌క్ష‌ల 30 వేల మంది ఉద్యోగులు పోస్ట‌ల్ బ్యాలెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని వెల్ల‌డించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 3 ల‌క్ష‌ల 30 వేల మంది మాత్ర‌మే పోస్ట‌ల్ బ్యాలెట్ వేశార‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ఎండ‌లు దంచి కొడుతున్నాయ‌ని, దానిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల‌కు ఓటు హ‌క్కు వినియోగించు కునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. అయితే ఒంగోలులో ఉద్యోగులు ప్ర‌లోభాల‌కు గురైన‌ట్లు తెలిసింద‌ని అన్నారు ముఖేష్ కుమార్ మీనా.