NEWSANDHRA PRADESH

కూట‌మి మేనిఫెస్టో బ‌క్వాస్

Share it with your family & friends

ఆర్థిక మంత్రి బుగ్గ‌న ఫైర్

నంద్యాల జిల్లా – టీడీపీ, జ‌న‌సేన కూట‌మి త‌యారు చేసిన మేని ఫెస్టో పూర్తిగా బ‌క్వాస్ అని కొట్టి పారేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నంద్యాల జిల్లా ప్యాపిలిలో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

నియోజకవర్గ తండాల ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంద‌న్నారు. మహిళలను మభ్యపెట్టే హామీల కట్ట.. కూటమి మేనిఫెస్టో అని ఎద్దేవా చేశారు. వాళ్లు వచ్చారో లేదో డోన్ లో ఫ్యాక్షన్ అలర్లు మొదలు పెట్టారని మండిప‌డ్డారు బుగ్గన రాజేంత్ర నాథ్ రెడ్డి.

డోన్ నియోజకవర్గంలోని తండాల ప్రజలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని స్ప‌ష్టం చేశారు.. సీతమ్మతండా, బుగ్గానిపల్లె తండా, అలేబాద్ తండాల ప్రజల ప్రేమాభిమానం మాటల్లో చెప్పలేనిదని అన్నారు.

ప్యాపిలి మండలంలోని బూరుగుల, వంకమిట్టపల్లె, ఎరుకలవాడ, కౌలుపల్లె, సీతమ్మతండా ప్రాంతాల్లో మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూరుగుల, సీతమ్మ తండా గ్రామాల్లో మంత్రి ప్రచారానికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ప్రజలను మభ్యపెట్టే హామీల కట్ట.. కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.