అభిషేక్ అదుర్స్ ఆట సూపర్
75 రన్స్ 8 ఫోర్లు 6 సిక్సర్లు
హైదరాబాద్ – ఐపీఎల్ 17వ సీజన్ లో ఊహించని రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు ప్రదర్శిస్తోంది. గత సీజన్ లో ఆశించిన మేర రాణించ లేక పోయిన ఆ జట్టు ప్రస్తుతం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతోంది. ప్రధానంగా హైద్రాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి , పాట్ కమిన్స్ లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడి ఆడుతున్నారు.
ప్రధానంగా హెడ్ , అభిషేక్ శర్మ దుమ్ము రేపారు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నారు. మైదానం నలు వైపులా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు ఎస్ ఆర్ హెచ్ బౌలర్లు. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. బదోనీ 9 ఫోర్లతో 55 రన్స్ చేస్తే పూరన్ 28 బంతులు ఎదుర్కొని 48 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 6 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి.
హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ , యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ దంచి కొట్టారు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు..హెడ్ 30 బంతుల్లో 89 రన్స్ చేశాడు. 8 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. శర్మ 28 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి వికెట్ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని అందించారు.