SPORTS

హైద‌రాబాద్ జోష్ కావ్య ఖుష్

Share it with your family & friends

ఐపీఎల్ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్

హైద‌రాబాద్ – స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఓన‌ర్ కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఐపీఎల్ వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు కొనుగోలు చేసింది ఆమె. అంద‌రూ త‌క్కువ అంచ‌నా వేశారు. కానీ ఊహించ‌ని రీతిలో త‌ను తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని నిరూపించారు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఆట‌గాళ్లు.

ప్ర‌ధానంగా ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ లెజెండ్ ప్యాట్ క‌మిన్స్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఆ స‌మ‌యంలో అంద‌రూ విస్తు పోయారు. ఒక క్రికెట‌ర్ కు ఇంత పెద్ద ఎత్తున ధ‌ర కోట్ చేయ‌డం ఏమిటని ప్ర‌శ్నించారు. కానీ కావ్య మార‌న్ డోంట్ కేర్ అంటూ డ‌బ్బులు చెల్లించింది.

ఇంకేం త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు క‌మిన్స్. త‌నకు అప్ప‌గించిన నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాడు. అంతే కాదు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆల్ రౌండ‌ర్ గా శివ‌మెత్తాడు. జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించేలా చేశాడు. ప్ర‌స్తుతం అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.

తాజాగా హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో క‌మిన్స్ జ‌ట్టు ల‌క్నో కు చుక్క‌లు చూపించింది. బౌల‌ర్లు 165 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. ఇదే స‌మ‌యంలో మైదానంలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ఆట‌గాళ్లు , ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ లు రికార్డు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. వికెట్ కోల్పోకుండానే దంచి కొట్టారు. టార్గెట్ పూర్తి చేశారు. దీంతో వారిద్ద‌రూ చెల‌రేగి ఆడుతుంటే ప‌ట్ట‌రాని సంతోషానికి లోనైంది కావ్య మార‌న్. ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.