NEWSANDHRA PRADESH

కూట‌మి చాప్ట‌ర్ క్లోజ్ – రోజా

Share it with your family & friends

ఏపీలో ఫ్యాన్ ప్ర‌భంజ‌నం

చిత్తూరు జిల్లా – రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆరు నూరైనా స‌రే చంద్ర‌బాబు నాయుడు జిమ్మిక్కులు చెల్ల‌వ‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాలు వ‌ర్క‌వుట్ కావ‌న్నారు. ఇక బీజేపీ ఉన్నా లేన‌ట్టేన‌ని సెటైర్ వేశారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి న‌గ‌రి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో ముచ్చటిస్తూ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మికి షాక్ త‌ప్ప‌ద‌న్నారు.

సంక్షేమ ప‌థ‌కాలు స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్న వైసీపీ స‌ర్కార్ కు జ‌నం ప‌ట్టం క‌ట్టేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా వాలంట‌రీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ప‌లు గ్రామాల‌కు చెందిన భ‌వ‌న కార్మికులు, ఇత‌రులు పెద్ద ఎత్తున మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సమ‌క్షంలో చేరారు. వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఫ్యాన్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంద‌ని , దానిని అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ లేద‌న్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ , పురందేశ్వ‌రి క‌ల‌లు క‌ల్ల‌లు కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. మ‌రోసారి సీఎంగా జ‌గ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం త‌థ్య‌మ‌న్నారు.