NEWSANDHRA PRADESH

ఏపీలో డబుల్ ఇంజ‌న్ స‌ర్కార్ ప‌క్కా

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

అమ‌రావ‌తి – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో ర్యాలీ చేప‌ట్టారు. రోడ్ షో నిర్వ‌హించారు.

ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన మోదీ ఇక రాబోయేది త‌మ కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ‌మేన‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ రెడ్డి కార‌ణంగా ఏపీ మ‌రో ప‌దేళ్లు అభివృద్దిలో వెన‌క్కి పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర స‌ర్కార్ అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హకారాలు అంద‌జేసింద‌ని కానీ దానిని స‌ద్వినియోగం చేసుకోలేక పోయారంటూ ధ్వ‌జ‌మెత్తారు మోదీ.

చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలోనే ఏపీ కాస్తో కూస్తో అభివృద్ది జ‌రిగింద‌ని , జ‌గ‌న్ రెడ్డి వ‌చ్చాక వినాశ‌న‌మే మిగిలింద‌ని ఆరోపించారు ప్ర‌ధాన‌మంత్రి. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, అందుకే ఏపీ అభివృద్ది కోసం , ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం తాము టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో పొత్తు కుద‌ర్చు కోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.