రేవంత్ రెడ్డి ట్యాక్స్ జనానికి షాక్
నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేసీఆర్
సంగారెడ్డి – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రజలపై కొత్తగా మరో పన్ను వచ్చి పడిందన్నారు. ఆ పన్ను ఏమిటంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఎద్దేవా చేశారు. తను సీఎంగా కొలువు తీరిన వెంటనే వసూలుకు తెర లేపాడని ఆరోపించారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వసూలు రాజాగా మారి పోయాడని ధ్వజమెత్తారు.
రియల్ ఎస్టేట్ వాళ్లు సీఎంను చూస్తేనే జంకుతున్నారని అన్నారు. వారంతా భయంతో పరుగులు తీసే పరిస్థితి నెలకొందన్నారు కేసీఆర్. స్క్వేర్ ఫీటుకు ఇంతని ఆర్ ఆర్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నాడని , ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు . ఇక్కడ వసూలు చేసిన డబ్బులను తీసుకు వెళ్లి ఢిల్లీలో అప్పగిస్తున్నాడని ఫైర్ అయ్యారు.
నిన్నటి దాకా హైదరాబాద్ కు ఓ ఇమేజ్ ఉండేదని , దానిని రేవంత్ రెడ్డి వచ్చాక పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు కేసీఆర్.