ఏపీని పరుగులు పెట్టిస్తా – బాబు
సంక్షోభం నుంచి గట్టెక్కిస్తా
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని చెప్పారు. ఆయన మీడియాతో సంభాషించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఇప్పటికే ఏపీని అప్పుల కుప్పగా మార్చేసిన జగన్ రెడ్డిని తిరిగి ప్రజలు ఎన్నుకుంటారని అనుకోవడం భ్రమ అని కొట్టి పారేశారు. జనం మార్పు కోరుకుంటున్నారని, జూన్ 4 తర్వాత ఎవరు ఏమిటనేది తేలుతుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తాను ఉన్నప్పుడు ఏపీకి ఓ ఇమేజ్ అంటూ ఉండేదని, కానీ జగన్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక పూర్తిగా డ్యామేజ్ చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎదురే లేదని అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్ర వీగాడని కానీ ఇప్పుడు వాస్తవం అర్థం అయ్యేసరికి జంకుతున్నాడని అన్నారు.
ఇప్పుడు జనం పేరు చెబితే భయాందోళనకు లోనవుతున్నాడని ధ్వజమెత్తారు. పవర్ ను ఉపయోగించి అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడని, కానీ ఈసీ సీరియస్ గా ఉందన్నారు ఈ విషయంలో. తాను వచ్చాక ఏపీని గాడిలో పెడతానని, సంపద సృష్టిస్తానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.