ప్రత్యర్థులపై కన్నేసి ఉంచండి
పిలుపునిచ్చిన విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని అన్నారు నెల్లూరు లోక్ సభ వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు వజ్రాయుధమని పేర్కొన్నారు.
కేవలం ఎన్నికల పోలింగ్ జరిగేందుకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. చివరి ఘట్టానికి చేరుకుందని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. తనపై నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు తాను ఎళ్లవేలలా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
జగన్ సైనికులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నాలుగు రోజుల పాటు శక్తి వంచన లేకుండా శ్రమించాలని పిలుపునిచ్చారు విజయ సాయి రెడ్డి. అప్రమత్తంగా ఉంటూనే ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.
ఈ ఎన్నికలు న్యాయానికి, ధర్మానికి మోసానికి దగాకు మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామమని స్పష్టం చేశారు. ప్రజలు గంప గుత్తగా జగన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు .