ENTERTAINMENT

ప‌వ‌న్ కు ఓటు వేయండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన త్రివిక్ర‌మ్

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. సాహిత్యంలో అక్ష‌రానికి , ప‌దానికి మ‌ధ్య ఎంతటి సంబంధం ఉందో త‌న‌కూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ధ్య అంత‌టి ద‌గ్గ‌రి బంధం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం పాట రాశాన‌ని, దీనిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున త‌న‌ను విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టార‌ని ఆరోపించారు. ర‌చ‌యిత‌, క‌వి, క‌ళాకారుల‌కు పార్టీలు, వ్య‌క్తులంటూ ప్ర‌త్యేకంగా ఎవ‌రూ ఉండ‌ర‌ని తెలిపారు.

అర్థం చేసుకోకుండా, అర్థం ప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తూ..విమ‌ర్శ‌లు గుప్పిస్తూ త‌న‌ను ట్రోల్ కు గురి చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను పంచు కోవ‌డం త‌న హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు.

ఏపీలో అరాచ‌క పాల‌న‌కు స్వ‌స్తి ప‌ల‌కాల్సిన అవస‌రం ఉంద‌న్నారు. అందుకే కూట‌మికి ఓటు వేసి గెలిపించాల‌ని పిలుపునిచ్చారు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్.