పంధ్రాగష్టు లోపు రుణ మాఫీ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా – ఆరు నూరైనా సరే , ఎన్ని ఇబ్బందులు పడినా సరే రాష్ట్రంలోని రైతులందరికీ వారు తీసుకున్న రుణాలను తీర్చడం జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు.
సిద్దల గుట్ట సాక్షిగా వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడం జరుగతుందని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గంప గుత్తగా తమను టార్గెట్ చేశాయని ఆరోపించారు. వారికి అంత సీన్ లేదన్నారు. రెండు పార్టీలు ఒక్కటేనని ఎద్దేవా చేశారు.
తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని చెప్పారు. కేవలం ఒక్కటి మాత్రమే మిగిలి ఉందని, అది రైతుల రుణ మాఫీ మాత్రమేనని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు చేసే విమర్శలను చూసి ఆందోళన పడవద్దని రైతులను ఉద్దేశించి సూచించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.