హైదరాబాద్ గడ్డ నాదే అడ్డా
ప్రకటించిన మాధవీలత
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె ప్రముఖ జర్నలిస్టు నబీలా జమాల్ తో జరిగిన ముఖా ముఖి సంభాషించారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో ప్రజలు తేలుస్తారన్నారు మాధవీలత.
గత కొన్నేళ్లుగా ఎంఐఎం ఏకఛత్రాధిపత్యం వహిస్తోందని, ఒక్క అభివృద్ది కూడా ఇక్కడ జరిగిన పాపాన పోలేదన్నారు. దీనిని ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. మతం పేరుతో ఇన్నాళ్లు చిల్లర రాజకీయాలు చేశారని , ఇక ఓవైసీకి చెక్ పెట్టేందుకు జనం సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు కంపెల్లి మాధవీలత.
ఇక జూన్ 4 తర్వాత ఎవరు గెలుస్తారనే దానిపై తేలుతుందన్నారు. ప్రజలు స్వచ్చంధంగా ఓటు వేసేందుకు కూడా స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చాక ప్రస్తుతం స్వేచ్ఛ లభిచిందని, వారంతా తమ విలువైన ఓటును తనకు వేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తాను గెలువ బోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు కొంపెల్లి మాధవీలత.