సంక్షేమం నినాదం సాధికారితే లక్ష్యం
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
అనంతపురం జిల్లా – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
గతంలో చంద్రబాబు నాయుడు ఏపీని సర్వ నాశనం చేశాడని, ఖాళీ చేతులతో ఖజానా అప్పగించాడని ధ్వజమెత్తారు. తిరిగి మరోసారి మోసం చేసేందుకు బయలు దేరాడని, టీడీపీ కూటమిని ఎవరూ నమ్మడం లేదన్నారు. జిమ్మిక్కులు, మ్యాజిక్కులతో జనాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
ప్రజలు స్పష్టంగా ఉన్నారని, వారంతా నవ రత్నాలు అమలు చేస్తున్న తమను గెలిపించాలని కంకణం కట్టుకున్నారని జగన్ రెడ్డి చెప్పారు. సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ది, సాధికారతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు సీఎం.
కూటమి ఓడి పోవడం ఖాయమని, ఇక వైసీపీ గెలుపును ఏ శక్తి అడ్డు కోలేదన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ఘనత తమ సర్కార్ దేనంటూ పేర్కొన్నారు.