రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్
జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం తప్పే
హైదరాబాద్ – రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల ఎంపికపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆమె ఓ ఛానల్ తో సంభాషించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రత్యేకించి నిజామాబాద్ ఎంపీ సీటు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడని ఆయనకు కాకుండా పార్టీ పరంగా ఎంతో అనుభవం, పరపతి కలిగిన మండవ వెంకటేశ్వర్ రావుకు టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు రేణుకా చౌదరి.
దీంతో ఇక్కడ టఫ్ ఉండేదని, ఇప్పుడు కార్యకర్తలు జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించు కోలేక పోతున్నారని పేర్కొనడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉండగా రేణుకా చౌదరి మొదటి నుంచి రెబల్ గా ఉంటూ వచ్చారు. ఆమె డైనమిక్ లేడీ లీడర్ గా గుర్తింపు పొందారు.
ఒక రకంగా చెప్పాలంటే జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల చాలా మటుకు పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి తప్పదన్నారు.