వైసీపీ పాలనలోనే అభివృద్ది
వినాశం కావాలా లేక వికాసం కావాలా
నంద్యాల జిల్లా – వైసీపీ పాలనలోనే అభివృద్ది అన్నది జరిగిందని స్పష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా బేతంచర్లలో పర్యటించి ప్రసంగించారు. మోడల్ నియోజకవర్గంగా డోన్ ను అభివృద్ది చేశానని చెప్పారు.
వికాసం కావాలంటే వైసీపీని గెలిపించాలని లేదా వినాశం కావాలని అనుకుంటే టీడీపీ కూటమికి ఓటు వేయాలని కోరారు. ఎక్కడ అభివృద్ది జరిగిందంటూ అవాకులు పేలుతున్న నాయకులకు సవాల్ విసిరారు. కళ్లుండీ చూడలేని మిమ్మల్ని జనం నమ్మే స్థితిలో లేరన్నారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
ఈసారి జరగబోయే ఎన్నికలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని తెలిపారు. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. గతంలో బాబు పాలనలో నంద్యాల, కర్నూలు జిల్లాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. కుల, మతాలకు , పార్టీలకు అతీతంగా అభివృద్దే ధ్యేయంగా పని చేశానని చెప్పారు.