జగన్ రెడ్డికి సీబీఐ బిగ్ షాక్
విదేశీ పర్యటనకు పర్మిషన్ ఇవ్వొద్దు
హైదరాబాద్ – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాను విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఆయనకు సంబంధించిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టింది. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాల్లో ఉన్న తన కూతురు, కొడుకును కలుసు కోవాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో ఈనెల 14న శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే విదేశీ టూర్ కు ప్లాన్ చేశారు జగన్ రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డి. ఇదిలా ఉండగా ఏపీ సీఎం చేసిన పిటిషన్ ను విచారణ చేపట్టింది కోర్టు.
ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతి ఇవ్వాలా లేదా అన్న దానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొంది. ఈ మేరకు కేసును మే 14 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
కాగా ఎట్టి పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వ వద్దని కోరింది సీబీఐ. మరో వైపు జగన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసింది సోదరి షర్మిల. ఆయన ఓటమి ఖాయమని విదేశాలకు పారి పోతున్నాడని, వెళ్లకుండా అడ్డు కోవాలని కోరింది.