మేం వస్తాం ఉద్యోగాలు ఇస్తాం
యువతకు రాహుల్ గాంధీ భరోసా
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతను ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన తన సందేశాన్ని పోస్టు చేశారు. నరేంద్ర మోదీ చెప్పే మాటలు విని మోస పోవద్దని కోరారు. పదేళ్ల పాటు ఆయన మాటలు విన్నారని, ఇప్పటికైనా కనీసం 10 వేల పోస్టులు భర్తీ చేశారా అని ప్రశ్నించారు.
జూన్ 4 తర్వాత దేశంలో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి అధికారంలోకి వస్తుందన్నారు రాహుల్ గాంధీ. కొలువు తీరిన వెంటనే తాము ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
దేశంలో భారతీయ జనతా పార్టీకి, మోదీకి ఎదురు గాలి వీస్తోందన్నారు. ఇంకా ఎంత కాలం కులం, ప్రాంతం, మతం పేరుతో రాజకీయాలు చేస్తారో చెప్పాలన్నారు. ప్రజలు వీరిని నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతి చోటా కాషాయానికి ఎదురు దెబ్బ తగలక తప్పదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.