NEWSTELANGANA

గులాబీకి శంక‌ర‌మ్మ గుడ్ బై

Share it with your family & friends

బీఆర్ఎస్ లో అన్యాయం జ‌రిగింది

హైద‌రాబాద్ – తెలంగాణ మ‌లి ద‌శ ఉద్యమానికి ఊపిరి పోసిన‌, అమ‌రుడైన శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా తాను బీఆర్ఎస్ లో చేరారు. కానీ అక్క‌డ త‌న‌కు స‌రైన గుర్తింపు లేద‌ని వాపోయారు. ఆ వెంట‌నే ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అక్క‌డ మాట‌లు త‌ప్ప‌, వాడు కోవ‌డం త‌ప్ప ఒరిగింది ఏమీ లేద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మానికి ప్రాణం పోసిన త‌న కొడుకు కోసం , త‌న కుటుంబం ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు శంక‌ర‌మ్మ‌. ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌ద‌ని తెలుసుకుని తాను మ‌న‌సు మార్చుకున్నాన‌ని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చు కునేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో మెజారిటీ లోక్ స‌భ స్థానాల‌లో హ‌స్తం పార్టీకి ఓటు వేయాల‌ని తాను ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు శంక‌ర‌మ్మ‌.

కాంగ్రెస్ పార్టీలోనే త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కంతో పార్టీలో చేరిన‌ట్లు స్ప‌ష్టం చేశారు శ్రీ‌కాంతాచారి త‌ల్లి.