NEWSNATIONAL

స‌ర్కార్ ను ప‌డ‌గొట్ట‌డ‌మే ఈడీ ప‌ని

Share it with your family & friends

ఆప్ ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్

న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాల‌న్న‌ది ప్ర‌ధాన మంత్రి మోదీ, ఆయ‌న ప‌రివారం , బీజ‌పీ , దాని అనుబంధ సంస్థ‌ల టార్గెట్ అని పేర్కొన్నారు ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్. గురువారం ఆయ‌న ఓ జాతీయ ఛాన‌ల్ తో సంభాషించారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీపై. స‌ద‌రు సంస్థ ప‌ని విచార‌ణ చేప‌ట్ట‌డం. కానీ మోదీ పీఎంగా కొలువు తీరాక కేవ‌లం బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం, ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డం, నేత‌ల‌ను ఏదో ర‌కంగా కేసుల‌లో ఇరికించేలా చేయ‌డం త‌ప్పితే ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ చేప‌ట్టి శిక్ష‌లు ప‌డేలా చేసిన దాఖ‌లాలు లేవ‌న్నారు ఎంపీ.

ఇక ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న నుంచి కానీ , సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, మాజీ మంత్రి జైన్ ల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేక పోయార‌ని అన్నారు. కేవ‌లం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే ఇవ‌న్నీ చోటు చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు సంజ‌య్ ఆజాద్ సింగ్.

ఇదే కేసుకు సంబంధించి ఈడీ ప్ర‌ధాన కుట్ర దారుగా పేర్కొన్న శ‌ర‌త్ రెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీకి రూ. 60 కోట్లు పార్టీకి లంచంగా ఇచ్చాడ‌ని ఆరోపించారు. ఆ వెంట‌నే ఆయ‌న‌కు బెయిల్ దొరుకుతుంద‌న్నారు. ఇదెలా సాధ్య‌మైందో మీరే చెప్పాలంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు. ముందు మోదీ, షాను అరెస్ట్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.