బరా బర్ నేను బిచ్చగాడినే
బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై లేని పోని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలపై భగ్గుమన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు.
చాలా మంది తనను బిచ్చగాడు అని ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. అవును బరాబర్ నేను బిచ్చగాడినే. నేను ఓట్లు అడుక్కుంటున్నా. వాళ్ళ లాగా ఓట్లు కొనాలని అనుకుంట లేనని అన్నారు . బండి సంజయ్ ఏం చేసిండని అడుగుతున్నారు. రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని చెప్పారు.
పోరాటాలు చేసిన. ప్రజల కోసం పని చేసిన. కరోనా వచ్చినప్పుడు చావుకు తెగించి, కరోనా వార్డులోకి వెళ్లి రోగులకు భరోసా కల్పించానని అన్నారు. వైద్యులు, సిబ్బందికి అండగా నిలిచానని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్థానిక మంత్రి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
మీ అందరి కోసం కొట్లాడింది నేను. ఓడినా, గెలిచినా వినోద్ రావుకు కరీంనగర్ గుర్తుకురాదు. నా మీద పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కు డిపాజిట్ కూడా ఆనాడు రాలేదన్నారు. అతనిని మళ్లీ ఎలా గెలిపించారో మీకే తెలియాలి. గౌరవెల్లి బాధితుల కోసం అండగా నిలిచి, అర్ధరాత్రి వారికోసం వచ్చి పోరాటం చేశాను. మరి ఆ సమయంలో మంత్రి ఎక్కడ ఉన్నాడని నిలదీశారు బండి సంజయ్ కుమార్.