పవర్ లోకి వస్తా భూ చట్టాన్ని రద్దు చేస్తా
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ కూటమి పవర్ లోకి రావడం పక్కా అన్నారు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి తీసుకు వచ్చిన దుర్మార్గమైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నవ రత్నాలు పేరుతో రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చేశారంటూ ధ్వజమెత్తారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్న సీఎంకు తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రకటించిన మేని ఫెస్టోను భగవద్గీతగా అభివర్ణించారు. ఇక కూటమి వచ్చిన 24 గంటల్లోపే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తామంటూ ప్రకటించారు టీడీపీ చీఫ్.
తమ కూటమికి అసెంబ్లీలో కనీసం 170కి పైగా సీట్లు వస్తాయని, ఇక లోక్ సభ స్థానాల పరంగా చూస్తే 21కి పైగా వచ్చే అవకాశం ఉందన్నారు.
తాము వచ్చాక గాడి తప్పిన పాలనను కంట్రోల్ లోకి తీసుకు వచ్చేలా చేస్తానన్నారు.