బక్కా జడ్సన్ నామినేషన్ దాఖలు
వరంగల్..ఖమ్మం..నల్లగొండ పట్టభద్రుల
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నాయకుడు బక్కా జడ్సన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్..నల్గొండ..ఖమ్మం జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతి, అక్రమాలను ఎండ గట్టడంలో, కేసులు వేయడంలో కీలకమైన పాత్ర పోషించారు.
కాంగ్రెస్ పార్టీ గొంతుకను వినిపించారు. అన్నింటికంటే కార్పొరేట్ కంపెనీల రియల్ ఎస్టేట్ దందాలను, హాస్పిటల్స్ అడ్డగోలు మోసాలను కళ్లకు కట్టినట్టు బయట పెట్టారు. చివరకు రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ కోసం పని చేసిన బక్కా జడ్సన్ ను పక్కన పెట్టడం చర్చకు దారి తీసింది.
ప్రజల తరపున తన గొంతును వినిపిస్తూ , ఓ వైపు కాలు ఇబ్బంది పెట్టినా బేఖాతర్ చేస్తూ ముందుకు వెళుతున్న బక్కా జడ్సన్ ను కావాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం దారుణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా తనను సస్పెండ్ చేసినా తాను ఊరుకునే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే ప్రకటించారు జడ్సన్. తాను ప్రజల కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.