కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు
జూన్ 2వ తేదీన లొంగి పోవాల్సిందే
న్యూఢిల్లీ – హమ్మయ్య ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ మంజూరరైంది ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైన పాత్ర పోషించారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఛార్జిషీట్ లో పేర్కొంది.
ఇదే కేసులో పలువురిని అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ సీఎంతో తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సైతం జైలుపాలు చేశారు.
ఆమె కూడా కేంద్రం కక్ష కట్టి తమను జైలుపాలు చేసిందని ఆరోపించారు. ఇది పక్కన పెడితే ఆప్ చీఫ్ , సీఎంను గత మార్చి 21న అరెస్ట్ చేసింది. ఆనాటి నుంచి నేటి దాకా తీహార్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళ తాను స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. కనుక తాను ప్రచారం చేయాల్సి ఉందని, విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే జూన్ 2వ తేదీ లోపు లొంగి పోవలని ఆదేశించింది.