కూటమి కామెంట్స్ సజ్జల సీరియస్
బాలయ్య..పవన్ భూముల సంగతేంటి
అమరావతి – వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డిపై నిరాధారమైన ఆరపోణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ చట్టం కారణంగా ఎవరికైనా పత్రాలు రాలేదని నిరూపించ గలవా చంద్రబాబు అంటూ సవాల్ విసిరారు.
ఇటీవలే నటులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ భూములు కొనుగోలు చేశారని, వాళ్లకు కూడా ఆయా భూములు తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. మరి వారికి ఇచ్చిన పత్రాలు వాస్తవమేనా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
బట్ట కాల్చి ఇతరుల మీద వేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేయగలిగిన సత్తా ఉన్నందుకే బెయిల్ పై బయటకు వచ్చాడని ఎద్దేవా చేశారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని సూచించారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.