సుప్రీం నిర్ణయం ప్రశంసనీయం
కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, ఈశాన్య ఢిల్లీ భారత కూటమి ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట కలిగించేలా భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది.
ఢిల్లీ సీఎం కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆప్ నేతలతో పాటు కూటమికి చెందిన సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా కన్హయ్య కుమార్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందనేందుకు ఈ తీర్పు ఓ ఉదాహరణ అని స్పష్టం చేశారు. కేవలం కక్ష సాధింపుతో ప్రత్యర్థులను రాజకీయంగా సమాధి చేయాలన్న కుత్సిత ఆలోచనలకు చెక్ పెట్టిన కోర్టు తీర్పును ప్రశంసించారు కన్హయ్య కుమార్.
తమ కూటమిలో కీలకమైన నేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.