ENTERTAINMENT

నేను ఏ పార్టీలో లేను – చిరంజీవి

Share it with your family & friends

త‌మ్ముడు గెల‌వాల‌ని కోరుకుంటున్నా

హైద‌రాబాద్ – మెగాస్టార్ చిరంజీవి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌స్తుతం ఏ రాజ‌కీయ పార్టీలో లేన‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త కొంత కాలంగా త‌న‌పై లేనిపోని వ్యాఖ్య‌లు, అభిప్రాయాలు, విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. అందుకే తెలుగు వారంద‌రికీ క్లియ‌ర్ గా స‌మాధానం ఇవ్వాల‌ని చెబుతున్న‌ట్లు తెలిపారు.

తాను పూర్తిగా ప్రొఫెష‌న‌ల్ న‌ని పేర్కొన్నారు. త‌న‌కు క‌ళ‌నే దైవ‌మ‌ని, దానినే ఎక్కువ‌గా ప్రేమిస్తాన‌ని చెప్పారు. న్యూఢిల్లీలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్నారు చిరంజీవి. అనంత‌రం హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

గ‌తంలో రాజ‌కీయాల‌తో సంబంధం ఉండేది. కానీ రాను రాను వాటికి దూరంగా ఉంటూ వ‌చ్చా. అంద‌రితో క‌లిసి ఉంటున్నా. ఏ పార్టీలో లేక పోయిన‌ప్ప‌టికీ త‌న త‌మ్ముడు,జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపు కోసం ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు.

అయితే తాను పిఠాపురం వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు మెగాస్టార్. అయితే తాను ప్ర‌చారానికి రావాల‌ని త‌న త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ఏనాడూ కోరుకోలేద‌ని అన్నారు . ఇందులో మ‌రో ప్ర‌శ్న‌కు తావే లేద‌న్నారు.