సైకోలు..రౌడీలకు చుక్కలు చూపిస్తా
హెచ్చరించిన చంద్రబాబు నాయుడు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిని ఓ సైకో అంటూ కామెంట్ చేశారు. ఆపై గన్నవరం బరిలో ఉన్న అభ్యర్థిపై కూడా సెటైర్ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గంలో పర్యటించారు. తాడో పేడో తేల్చు కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
జగన్ రెడ్డి సాగిస్తున్న రాచరిక పాలనకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఎన్ని తీసుకు వచ్చాడో చెప్పాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలో పెద్ద సైకో ఉన్నాడని, ఇక గన్నవరంలో పిల్ల సైకో కొలువు తీరాడంటూ ఎద్దేవా చేశారు టీడీపీ చీఫ్.
ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నాయని, టీడీపీ కూటమిని గెలిపించు కోవాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. .