జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట విధి విధానాలు పాటించ‌కుండా, ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా రూ. 15 వేల జీతంతో సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులను స్ట్రీమ్‌లైన్ చేశాం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదన్నారు ., రెగ్యులరైజేషన్‍ను మా ప్రభుత్వమే అమలు చేసిందని చెప్పారు.

అన్ని డిపార్ట్మెంట్ ల వారికి ప్రమోషన్ ఛానల్ కల్పిస్తున్నాం అని పేర్కొన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి. ఇప్పటికే 15 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చాం, మిగిలిన వారికి త్వరలోనే ప్రమోషన్లు ఇస్తాం అని ప్ర‌క‌టించారు. ఎవరికి లేని విధంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ శాంక్షన్ లీవ్ విధానం తీసుకొచ్చాం అని తెలిపారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్‍ ను ఇప్పటికే ఆర్థికశాఖకు పంపడం జరిగిందని వెల్ల‌డించారు. సిబ్బంది కొరత ఉన్నప్పుడు ఒకరికొకరు సేవలు అందించేలా డీసెంట్రలైజ్ చేశాం అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలన్న తపన తప్ప వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదన్నారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    ‘ఒక గ్రాము బంగారు ఉంగరం’ పథకం ప్రారంభం

    చెన్నై : టీవీకే ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నెర‌వేర్చే ప‌నిలో ప‌డ్డారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. నవజాత శిశువుల కోసం ‘ఒక గ్రాము బంగారు ఉంగరం’ పథకాన్ని సోమ‌వారం ప్రారంభించారు. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *