విమర్శలకు ఈసీ అతీతం కాదు
స్పష్టం చేసిన పి. చిదంబరం
చెన్నై – కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ దేశంలో రాజ్యాంగం ముఖ్యమని, దేశం కంటే , ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని గుర్తు పెట్టు కోవాలని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం విమర్శలకు అతీతం కాదని స్పష్టం చేశారు పి. చిదంబరం. ఈసీఐ చేసినవి, చేయనివి చాలా ఉన్నాయని తెలుసుకుంటే మంచిదని అన్నారు. దేశంలోనే అత్యున్నతమైన సంస్థలుగా భావించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ , ఫైనాన్స్ కమిషన్ లతో పాటు ఇతర సంస్థలను విమర్శిస్తున్నప్పుడు ఈసీని ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ప్రశ్నించారు పి. చిదంబరం.
పార్లమెంట్ సమావేశాలు జరగనీయాలని, ఈసీఐ లోపాలు ఏమిటో తెలియ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆనాడు తమిళనాడుకు చెందిన టీఎన్ శేషన్ లాంటి అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.