జగనన్నా ఈ ప్రశ్నలకు బదులేది..?
నిప్పులు చెరిగిన సోదరి వైఎస్ షర్మిల
కడప జిల్లా – తన సోదరుడు ఏపీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నాకు రాజకీయ కాంక్ష అధికంగా ఉన్నట్లు చెప్పడాన్ని తప్పు పట్టారు. తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, నువ్వు జైల్లో ఉన్న సమయంలో తాను వైసీపీని బలొపేతం చేసేందుకు కృషి చేసిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ముందు దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ బిడ్డను రాజకీయాలకు తీసుకు వచ్చింది ఎవరంటూ ప్రశ్నించారు. నువ్వు జైల్లో ఉన్న సమయంలో 19 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ప్రచారం చేయమంటూ నన్ను అడిగిన విషయం అప్పుడే మరిచి పోతే ఎలా అని మండిపడ్డారు.
చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమని చెప్పింది నువ్వు కాదా ? సమైక్యాంధ్ర ఉద్యమానికి నన్ను రాజకీయంగా వాడుకున్నది నువ్వు కాదా అని నిలదీశారు. నాకు రాజకీయ కాంక్ష గనుక ఉంటే..నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నావన్న విషయం మరిచి పోవడం బాధాకరమన్నారు.
ఒకవేళ తనకు రాజకీయ కాంక్ష గనుక ఉన్నట్లయితే ఆనాడే పార్టీని హైజాక్ చేసేదానినని పేర్కొన్నారు. నేను పొందాలని అనుకుంటే నీకంటే ఎక్కువ పోస్ట్ వచ్చేదన్నారు. నన్ను ఎంపీ చేయాలని మీ పార్టీ వారే నన్ను అడగలేదా అన్నారు.
నిన్ను సీఎంను చేసేందుకు నేను త్యాగం చేశానని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. దమ్ముంటే బైబిల్ మీద ప్రమాణం చేయ్ అంటూ సవాల్ విసిరారు. రాజకీయాల కోసం నన్ను నెపోటిజం అంటే ఎలా అని మండిపడ్డారు.