గుజరాత్ భళా చెన్నై విలవిల
ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం
గుజరాత్ – ఐపీఎల్ 2024లో భాగంగా తాడో పేడో తేల్చు కోవాల్సిన సమయంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ చేతులు ఎత్తేసింది. చివరకు ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. మోతేరా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మోత మోగించింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ సాధించింది. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేసింది.
కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడారు. సెంచరీలు సాధించి విస్తు పోయేలా చేశారు. లీగ్ లో చెన్నై ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిని గెలవాల్సి ఉంది. విచిత్రం ఏమిటంటే ప్లే ఆఫ్స్ రేసులో లేక పోయినా గుజరాత్ దుమ్ము రేపింది. చెన్నైని 35 రన్స్ తో ఓడించింది.
ఇక గుజరాత్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గిల్ 55 బంతులు ఎదుర్కొన్నాడు. 9 ఫోర్లు 6 సిక్సర్లు కొట్టాడు. 104 రన్స్ చేశాడు. ఇక తానేమీ తక్కువ కాదంటూ సాయి సుదర్శన్ 51 బంతులు ఆడాడు. 5 ఫోర్లు 7 సిక్సర్లు కొట్టాడు. 103 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో ఓపెనర్లు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏకంగా ఒకటో వికెట్ కు 210 రన్స్ చేశారు.
ఇక మైదానంలోకి దిగిన చెన్నై చివరి దాకా పోరాడింది. 8 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 34 బంతులు ఎదుర్కొని 63 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. అలీ 36 బంతులు ఎదుర్కొని 56 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.