శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం తిరుమ‌ల‌కు విచ్చేశారు. ఆయ‌న
సింగపూర్ హోం శాఖ మంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించు కునేందుకు సోమవారం రాత్రి తిరుమల చేరుకున్న సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఈ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగంను శ్రీవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు.

ఇరువురు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు నారా లోకేష్. కోట్లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా తిరుమ‌ల కొన‌సాగుతోంద‌న్నారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పెద్ద ఎత్తున వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. సామాన్యుల‌కే పెద్ద పీట వేస్తున్నామ‌న్నారు.

  • Related Posts

    ఘ‌నంగా వీర శైవ లింగాయ‌త్ ధ‌ర్మ సంర‌క్ష‌ణ స‌మ్మేళ‌నం

    బెంగ‌ళూరు : అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థ (రెజి.) , అఖిల భారత వీరశైవ లింగాయత్ మహా సభల సంయుక్త ఆధ్వర్యంలో బెంగళూరులోని విజయనగరంలో జరిగిన వీరశైవ లింగాయత్ ధర్మ సంరక్షణ సమ్మేళనాన్ని పవిత్ర జగద్గురువు పంచ పీఠాధీశ్వరుల వారి…

    ప్రత్యేక ప్రతిభావంతులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

    తిరుమ‌ల : ప్రత్యేక ప్రతిభావంతులు తమలోని ప్రతిభను గుర్తించి, నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకుని ఆత్మ విశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పాత అన్నప్రసాద భవనంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *