కదం తొక్కిన సుదర్శన్
చెన్నైకి కోలుకోలేని షాక్
అహ్మదాబాద్ – ఐపీఎల్ 2024 లో జరిగిన లీగ్ చివరి దశకు చేరుకుంది. తాడో పేడో తేల్చు కోవాల్సిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ బిగ్ స్కోర్ ముందుంచింది. శుభ్ మన్ గిల్ , సాయి సుదర్శన్ రికార్డ్ సృష్టించారు. ఓపెనింగ్ భాగస్వామ్యంలో దుమ్ము రేపారు. ఇద్దరూ కలిసి సెంచరీలతో కదం తొక్కారు.
చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. మైదానం అంతటా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన గుజరాత్ 231 పరుగులు చేసింది.
గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ శుభ్ మన్ గిల్ 104 రన్స్ చేస్తే సాయి సుదర్శన్ తానేమీ తక్కువ కాదన్నట్టు 103 పరుగులతో రెచ్చి పోయాడు. అనంతరం మైదానంలోకి దిగిన చెన్నై చివరి దాకా పోరాడింది. 8 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 34 బంతులు ఎదుర్కొని 63 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. అలీ 36 బంతులు ఎదుర్కొని 56 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి.