‘ఇంపాక్ట్ ప్లేయర్’ పై షా కామెంట్
ఈ రూల్ శాశ్వతం కానే కాదు
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జే షా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 లీగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ఇది వివాదాస్పదం అవుతోంది.
దీనిపై క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశారు జే షా. ఈ నిబంధన కావాలని తీసుకు రాలేదని పేర్కొన్నాడు. ఇది పూర్తిగా వాడేది లేదని స్పష్టం చేశాడు. కేవలం పరీక్షించేందుకు మాత్రమే ఉపయోగించినట్లు తెలిపాడు. జే షా మీడియాతో మాట్లాడారు. ఇంపాక్ట్ ప్లేయర్ అంశం చర్చకు దారి తీయడం మామూలేనని తెలిపాడు.
ఈ నిబంధన వల్ల ఇద్దరు ఇండియన్ క్రికెటర్లకు ఛాన్స్ దక్కుతుందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది తాము కాదని స్పష్టం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆయా జట్లకు లాభం చేకూరుతుందా లేదా నష్టం కలిగిస్తుందా అన్నది తేల్చాల్సింది ప్లేయర్లతో పాటు ఫ్రాంచైజీలు, క్రికెట్ పరంగా అనుభవజ్ఞులు తేల్చాలని అన్నారు జే షా.
ప్రస్తుతం జే షా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మొత్తంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసి వేయాలని జట్లు కోరుతున్నాయి.