ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ కు గోల్డ్ అవార్డు

అమ‌రావ‌తి : రాజ‌కీయ రంగంలో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన , పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేసేలా ప్ర‌య‌త్నం చేసిన ఘ‌న‌త ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుది. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు అయినా ఇప్ప‌టికీ కుర్రాళ్ల తో పోటీ ప‌డుతూ ముందుకు సాగుతున్నారు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఏపీ అభివృద్దికి బాట‌లు వేస్తోంది. ఈ త‌రుణంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కు (APDC) అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిజిటల్ , సోషల్ మీడియా ప్రచారం , అవగాహన కార్యక్రమానికి గోల్డ్ అవార్డు లభించింది.

దేశ వ్యాప్తంగా అత్యంత పరిమిత సంఖ్యలో అందించిన గోల్డ్ అవార్డుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్‌కు దక్కడం గర్వ కారణమని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అదే విధంగా సమాచార, పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ కు సిల్వర్ అవార్డు లభించింది. దేశ వ్యాప్తంగా అందించిన 30 సిల్వర్ అవార్డుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖకు దక్కడం హర్షణీయమని సీఎం అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న పురోగతికి జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు ప్రతి ఒక్కరికీ గర్వ కారణం అని అన్నారు. ఇది దక్కించుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు.

  • Related Posts

    ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు ఆహ్వానం

    అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు దరఖాస్తు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌. వీడియో జర్నలిస్ట్ ప్రస్తుతం శాటిలైట్ లేదా కేబుల్ టీవీ నెట్‌వర్క్ వంటి ఎలక్ట్రానిక్…

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *