సీఈసీ వ్య‌వ‌హారంపై నోరు మెద‌ప‌ని విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు డీఎంకే ఎంపీ క‌నిమొళి. విజయ్‌ను ఉద్దేశించి “ప్రియమైన తమ్ముడు విజయ్” అని పిలిచారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల సంఘం, క‌మిన‌ర్ జ్ఞానేష్ కుమార్ వ్య‌వ‌హారంపై ఆందోళ‌న కొన‌సాగుతుంటే ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం విజ‌య్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిల‌దీశారు ఎంపీ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రవర్తనపై స్టాలిన్, పలు పార్టీల నాయకులు ఫిర్యాదులు చేసినప్పటికీ ముఖ్యమంత్రి ఆయన ప్రవర్తన గురించి మౌనంగా ఉన్నారని ఆమె అన్నారు. ధారపురం ఉప ఎన్నికల సన్నాహాలకు సంబంధించి ధారపురం ఎన్నికల కార్యాలయంలో జరిగిన సంప్రదింపుల సమావేశంలో ప్రసంగించారు.

డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి మాట్లాడారు. ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌ను ‘స్వీట్ అంకుల్’ అని పిలిచినట్లే, తాను కూడా ఆయనను “ప్రియమైన తమ్ముడు విజయ్” అని పిలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని, శాంతి భద్రతలు, విద్యుత్ పరిస్థితి క్షీణించడంతో పాటు మహిళలు, పిల్లల భద్రత కూడా దిగజారిందని కనిమొళి ఆరోపించారు . ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌ను ఇచ్చిన సీఎం సీఈసీ విష‌యంలో ఎందుకు స్పందించ‌డం లేద‌ని నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఉప ఎన్నిక‌లలో తాము గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు. .

  • Related Posts

    ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ కు గోల్డ్ అవార్డు

    అమ‌రావ‌తి : రాజ‌కీయ రంగంలో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన , పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేసేలా ప్ర‌య‌త్నం చేసిన ఘ‌న‌త ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుది. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు అయినా ఇప్ప‌టికీ కుర్రాళ్ల తో పోటీ…

    ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు ఆహ్వానం

    అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తమ వీడియో జర్నలిస్ట్ అవార్డులకు దరఖాస్తు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌. వీడియో జర్నలిస్ట్ ప్రస్తుతం శాటిలైట్ లేదా కేబుల్ టీవీ నెట్‌వర్క్ వంటి ఎలక్ట్రానిక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *