మరోసారి చాన్స్ ఇవ్వండి – జగన్
ఏపీని దేశంలోనే నెంబర్ వన్ చేస్తా
కడప జిల్లా – మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం తన స్వంత ఇలాఖా కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా కడప సర్కిల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎంపీగా అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన గెలిస్తే కడపను మరింత అభివృద్ది చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు జగన్ రెడ్డి. కొందరు తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు.
కొన్ని దుష్ట శక్తులు వారి వెనుక ఉండి తనపై ఉసిగొల్పేలా చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బావుంటుందని అన్నారు జగన్ రెడ్డి. ఈ గడ్డకు తాను ఎల్లప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.
ఈ ప్రాంతం తన తాత రాజా రెడ్డిని, తండ్రి రాజశేఖర్ రెడ్డిని, చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఆదరించిందని, అక్కున చేర్చుకుందని గుర్తు చేశారు., తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా చేస్తానని ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి. తాను చెప్పనని, కానీ ఒక్కసారి కమిట్ అయ్యానంటే ఎవరికీ భయపడనని అన్నారు.