సైకో రెడ్డిని తరిమి కొట్టండి
పిలుపునిచ్చిన చంద్రబాబు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేయడం కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా టీడీపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
జగన్ రెడ్డి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. జగన్ రెడ్డి మాచర్ల నియోజకవర్గాన్ని మొత్తం రక్తంతో తడిపేశాడంటూ ఆరోపించారు.
హత్యా రాజకీయాలకు తెర లేపాడని, కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడని హెచ్చరించాడు. తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చిన వెంటనే రౌడీ రాజకీయాలను అణచి వేస్తానని హెచ్చరించాడు నారా చంద్రబాబు నాయుడు. పద్దతి మార్చుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
రాష్ట్రాన్ని పాలించే అహంకారి, దోపిడిదారు, సైకో జగన్ ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజల భూములు, ఆస్తులు కబ్జా చేసే జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు పీకి.. రాజముద్ర వేయిస్తానని ప్రకటించారు .