కుట్రలకు తెర లేపిన కూటమి
నిప్పులు చెరిగిన ఏపీ సీఎం జగన్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని ప్రసంగించారు. అక్కా చెల్లెమ్మలకు లబ్ది చేకూరకుండా చంద్రబాబు నాయుడుతో కూడిన కూటమి కుట్రలకు తెర లేపిందని ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు సీఎం.
ఢిల్లీ పెద్దలతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికలయ్యాక ఇస్తామని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది కుట్ర కాదా అని నిలదీశారు . నాకు కావాల్సింది ప్రజల ముఖాల్లో సంతోషం చూడాలని అనుకోవడం తప్పా అని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తమకు ఆదరణ లభిస్తోందని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. తమకు కనీసం 160కి పైగా సీట్లు రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఏది ఏమైనా రెండోసారి అధికారంలోకి రావడం పక్కా అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు, పవన్ కళ్యాణ్ మ్యాజిక్ లు, పురందేశ్వరి అంచనాలు తారు మారు కావడం తప్పదన్నారు సీఎం.