బీఆర్ఎస్ కు 14 సీట్లు పక్కా
ప్రకటించిన బాస్ కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి కనీసం 14 సీట్లకంటే ఎక్కువగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17 సీట్లు ఉండగా భారతీయ జనతా పార్టీకి కనీసం ఒకటి లేదా రెండు సీట్లు రావచ్చని అన్నారు.
ఇక ఆరు గ్యారెంటీల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టి పవర్ లోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గాలి వీస్తోందని అన్నారు కేసీఆర్ . ఆ పార్టీకి 2 సీట్లు వస్తే మహా కష్టం అని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.
బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఓట్లు కొల్లగొట్టడం తప్పితే ఈ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు కేసీఆర్. ఆ పార్టీకి ఈసారి ఎన్నికల్లో 200 సీట్ల కంటే తక్కువే వస్తాయని చెప్పారు.