మోదీ నియంతృత్వం చెల్తదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక
మహారాష్ట్ర – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంకానా ఇకపై చెల్లదన్నారు.
ఒక వైపు నిజం ఇంకో వైపు అబద్దం మధ్య జరుగుతున్న యుద్దమని పేర్కొన్నారు. ఒక వైపు సేవ, అంకిత భావం, అధికారమే పరమావధిగా పని చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మరోసారి గనుక బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
ఇకనైనా దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడు కునేందుకు ఆలోచించాలని, ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ. ఎలాంటి ప్రభుత్వం కావాలో నిర్ణయించు కోవాల్సింది మీరేనని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. భారత కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం స్పష్ం చేశారు ప్రియాంక గాంధీ.