NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ కోసం ‘మెగా’ ప్ర‌చారం

Share it with your family & friends

అల్లు అర‌వింద్..రామ్ చ‌ర‌ణ్

పిఠాపురం – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేప‌ట్టారు మెగా ఫ్యామిలీ. శ‌నివారం చిరంజీవి భార్య సురేఖ‌, అల్లు అర‌వింద్ , రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌న్ తో క‌లిసి ప్ర‌ముఖ శ‌క్తి పీఠం పురూహితికా అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. వారికి పూజారులు, ఆల‌య క‌మిటీ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

అక్క‌డి నుంచి చేబ్రోలు లోని ప‌వ‌న్ నివాసానికి వెళ్లారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నింటిని , అంద‌రినీ వ‌దిలి వేసి మీ కోసం ఇక్క‌డికి వ‌చ్చార‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు మీ విలువైన ఓటును ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వేయాల‌ని పిలుపునిచ్చారు.

వీరితో పాటు రైజింగ్ స్టార్ అల్లు అర్జున్ సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు స‌పోర్ట్ గా ప్ర‌చారం చేయ‌డం విశేషం. భారీ ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. ప్ర‌స్తుతం పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా వంగా గీత ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ పిఠాపురంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌చారం నిర్వ‌హించ‌డం విశేషం.

ఈసారి గ‌నుక వంగా గీత‌ను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా హామీ ఇస్తున్న‌ట్లు స్పష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.